
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవలే విడుదలైన మంచి హిట్ టాక్ నూ సొంతం చేసుకుంది.
తాజాగా హీరో వెంకటేష్ అనాథపిల్లల కోసం ఈ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఆ షో లో పాల్గొని ఆ పిల్లలను సంతోషపెట్టారు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ చిన్నారులందరికీ బహుమతులు పంపిణీ చేశారు. ఓ పెద్ద హీరో తమతో గడిపినందుకు ఆ పిల్లలు కూడా ఆనందంతో పొంగిపోయారు. ఆయన చుట్టూ చేరి ఆయన్ను కౌగిలించుకొని ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు.