మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో పెరుగుతున్న బాధితులు

మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో పెరుగుతున్న బాధితులు

మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో మృతుల సంఖ్య రెండుకి చేరింది. బాధితుల సంఖ్య రోజురోజూ పెరుగుతోంది. చిన్నమ్మ(80) అనే వృద్దురాలు గాంధీలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. ఇది వరకే భీమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

ఇప్పటికి 125 మంది కలుషిత నీటితో హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ నీళ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరిస్తున్నామని.. నీటిలో ఎలాంటి ఇబ్బంది కరమైన అంశాలు కనిపించలేదన్నారు జిల్లా వైద్యాధికారి స్వరాజ్యం. నీటిలో ఉండాల్సినంత క్లోరిన్  శాతం ఉందని.. అంతమంది  దవాఖానాల్లో చేరడానికి నీళ్లు కారణం కాదంటున్నారు వాటర్ బోర్డ్ అధికారులు. బస్తీవాసులు మాత్రం తాము నీళ్ల కారణంగానే హాస్పిటల్ పాలయ్యామంటున్నారు.

ఇవి కూడా చదవండి

సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం