కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..

పాట్నా: బిహార్ లోని రోహ్ తాస్ జిల్లాలో ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి జేసీబీ, బ్రిడ్జికి సంబంధించిన విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడిన మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కంప్లైంట్ ఇచ్చిన అధికారే ఈ దొంగతనానికి కీలక సూత్రధారి అని తేలడంతో అందరూ షాకయ్యారు. ఇక వారం కిందట ‘బిహార్ లో బ్రిడ్జిని దొంగలు ఎత్తుకెళ్లారు’ అని తెలవడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలో దొంగలను పట్టుకున్నారు. 

ఇదిలా ఉండగా... వారం కిందట తాము ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులమంటూ  కొంత మంది వ్యక్తులు అమియవర్ గ్రామానికి వచ్చారు. కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పాత బ్రిడ్జిని తీసుకెళ్తున్నామని చెప్పి.... జేసీబీ, లారీలు సహాయంతో 50 ఏళ్ల నాటి పాత ఇనుప బ్రిడ్జిని తొలగించారు. అనంతరం లారీల్లో వేసుకొని అక్కడి నుంచి చెక్కేశారు. వారు ప్రభుత్వ వ్యక్తులనేనని నమ్మిన గ్రామస్థులు వారికి సాయం కూడా చేశారు. కానీ ఆ వచ్చిన వాళ్లు దొంగలు అని తెలవడంతో గ్రామస్థులు ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి... సబ్ డివిజనల్ ఆఫీసరే ఈ వ్యవహారానికంతటికీ సూత్రధారి అని తేల్చారు. అతడితో పాటు దొంగతనానికి పాల్పడిన మిగతా వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు