జీహెచ్ఎంసీ ‘కామన్ పే బిల్ యాప్’ ..ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్,వాటర్ బిల్లులు కట్టుకునే ఛాన్స్ 

 జీహెచ్ఎంసీ ‘కామన్ పే బిల్ యాప్’ ..ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్,వాటర్ బిల్లులు కట్టుకునే ఛాన్స్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీ ‘కామన్ పే బిల్ యాప్’ ను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు కరెంట్, వాటర్ బిల్లులు కూడా కట్టే అవకాశం ఉంటుంది. వాటర్, కరెంట్ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉందని యజమానులకు ఈ యాప్​ఎప్పటికప్పుడు రిమైండ్​చేస్తుంది. ఇప్పటికే యాప్ సిద్ధమైందని, అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్తున్నారు. కస్టమర్​మొబైల్​నంబర్​ఎంటర్​చేసి రిజిస్టర్​అయితే అతడికి సంబంధించిన అన్ని కనెక్షన్లు కనిపిస్తాయని, దాని ప్రకారం బిల్లు కట్టుకోవచ్చంటున్నారు.