ఉపాధి స్కీమ్ లో పేరు తీసేయడం గాంధీని మరోసారి హత్య చేయడమే : వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

ఉపాధి స్కీమ్ లో పేరు తీసేయడం గాంధీని మరోసారి హత్య చేయడమే : వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
  • కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం అన్యాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి తెలిపారు. ఆర్ఎస్ఎస్​కు చెందిన నాథురామ్ గాడ్సే 1948లో మహాత్ముడిని భౌతికంగా హత్య చేస్తే.. ప్రధాని మోదీ ఉపాధీ హామీ స్కీమ్ నుంచి గాంధీ పేరును తొలగించి బాపూజీని మరోసాని హత్య చేశారని మండిపడ్డారు. పేదల కడుపు కొట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు.

ఈ మేరకు సోమవారం సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌‌‌‌సీయూ)లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఎన్ఎస్ యూఐ, ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ సెమినార్‌‌‌‌కు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ స్కీమ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తోందన్న ఓర్వలేనితనంతోనే మోదీ సర్కార్ గాంధీ పేరును తొలగించిందని ఆరోపించారు.