- ధర్నా చౌక్‌లో ఉపాధి హామీ కూలీల ధర్నా
ముషీరాబాద్, వెలుగు: ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి, వీబీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ హక్కుల పరిరక్షణ ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఉపాధి హామీ కూలీలు ధర్నా నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ కొత్త చట్టంలో వ్యవసాయ రద్దీ సమయంలో 60 రోజులు పని నిషేధించడం ఉపాధి హామీ భద్రతకు విరుద్ధమన్నారు. 125 రోజుల పని కల్పిస్తామనే వాగ్దానం పెద్ద అబద్ధమని నొక్కి చెప్పారు.
