మంచిర్యాల: చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంగళవారం (ఫిబ్రవరి 3) చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మంత్రి వివేక్ బీ ఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టికెట్ ఆశించి భంగపడిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు.
ఎవరు బాధ పడొద్దని.. నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించాలని అభ్యర్థులు, కేడర్‌కు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా..13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
