బొగ్గు ఉత్పత్తిపై మేడారం ఎఫెక్ట్

బొగ్గు ఉత్పత్తిపై మేడారం ఎఫెక్ట్

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహా జాతర ఎఫెక్ట్ భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిపై పడింది. కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లాల్సి రావడంతో కార్మికులు ఎక్కువగా సెలవులు పెట్టారు. దీంతో భూపాలపల్లి ఏరియా నుంచి జనవరిలో 45 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి అయిందని ఏరియా ప్రతినిధి ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సోమవారం వెల్లడించారు.

ఇక్కడి నుంచి జనవరిలో 4.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ పెట్టగా, 2.01 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించినట్లు తెలిపారు. 4.45 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా, 3.25 లక్షల టన్నులు రవాణా చేశామన్నారు. ఫిబ్రవరిలో టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు కార్మికులు సమష్టిగా పనిచేయాలని జీఎం రాజేశ్వర్​రెడ్డి కోరారు.