ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం

AP లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. సీఎం YS జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులతో గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్  ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో మంత్రుల పేర్లు సీఎస్ సమీర్  శర్మ చదువుతుండగా వారితో గవర్నర్  ప్రమాణం చేయించారు. మొదట సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేయగా... చివరలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ప్రమాణం చేశారు. కొత్త కేబినెట్ లో 11 మంది పాత మంత్రులను కంటిన్యూ చేయగా... కొత్తగా 14 మందికి చాన్సిచ్చారు. మంత్రులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ అభినందనలు తెలిపారు. అమరావతిలోని సెక్రటేరియట్ ఆవరణలో జరిగిన కార్యక్రమాలు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరిన్ని వార్తల కోసం

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు