కొల్లాపూర్, వెలుగు : పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో కలిసి విందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మశుద్ధికి, సహనానికి, దాతృత్వానికి ప్రతీక అని కొనియాడారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలతో కార్యక్రమం సందడిగా సాగింది.
