పెరిగిన యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ ఫీజు

పెరిగిన యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ ఫీజు

న్యూఢిల్లీ:  రానున్న ఆర్థిక సంవత్సరం (2026–27) కోసం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజును  రూ.75 పెంచామని నేషనల్ హైవేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ) ప్రకటించింది.  దీంతో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ ధర ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 తర్వాత  రూ.3,075 కి చేరుతుంది. 

ప్రస్తుతం రూ.3,000 ఫీజు వసూలు చేస్తున్నారు.   ఈ యాన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్ సౌకర్యం 2025 ఆగస్టు 15న ప్రారంభమైంది. ప్రస్తుతం 56 లక్షలకుపైగా యూజర్లు దీనిని వాడుతున్నారు.