కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని 63వ డివిజన్ జ్యోతినగర్‌కు చెందిన స్వశక్తి మహిళ దయ్యాల హరితశ్యామ్ న్యూఢిల్లీలో ఈ నెల 13న నిర్వహించిన అమృత్ మిత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. 63వ డివిజన్ లోని శ్రీ చైతన్య సభ్యురాలు హరిత అమృత్ మిత్రగా ఎంపికై, కొంతకాలంగా జ్యోతి నగర్ లోని వాటర్ ట్యాంక్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమృత్ మిత్రలు పాల్గొనగా తెలంగాణలోని 5 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఐదుగురు స్వశక్తి సంఘాలకు చెందిన అమృత్ మిత్రలను నామినేట్ అయ్యారు.
అందులో కరీంనగర్ టౌన్‌కు చెందిన హరిత శ్యామ్‌కు అవకాశం లభించింది. మహోత్సవంలో ఐదు కార్పొరేషన్ల నుంచి బి.అనిత (శ్రీసరస్వతి ఎస్ఏహెచ్, రామగుండం), హరిత (శ్రీ చైతన్య ఎస్ఏహెచ్, కరీంనగర్), చిట్టెమ్మ (మయూరిక మహిళా సంఘం, మహబూబ్ నగర్), ఎల్.ఝాన్సీ రాణి (లయ ఎస్ఏహెచ్, ఖమ్మం), చిట్యాల శ్రీలత (మేరీమాత పొదుపు సంఘం, జీడబ్ల్యూఎంసీ) పాల్గొన్నారు. ఈ ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లింది.
