దిల్‌సుఖ్‌నగర్, వెలుగు: విక్టోరియా మెమోరియల్ హోమ్ స్కూల్‌ను ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ అండ్ కాస్మో ఎమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు.
ఖేలో ఇండియా, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పున్న గణేశ్ నేత, దేప భాస్కర్ రెడ్డి, బుడ్డా సత్యనారాయణ, నర్సింహ, స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీపార్వతి పాల్గొన్నారు.
