మళ్లీ రోడ్డెక్కితే జేబులో డ్రగ్స్ పెట్టి లోపలేస్తా.. బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గేలా చేస్తా..

మళ్లీ రోడ్డెక్కితే జేబులో డ్రగ్స్ పెట్టి లోపలేస్తా.. బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గేలా చేస్తా..
  • విద్యార్థులను బెదిరించిన పోలీస్​ డ్రైవర్

ముంబై : పేపర్ లీకేజీకి నిరసనగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులను ఓ పోలీస్ డ్రైవర్ బెదిరించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. పోలీస్ వ్యాన్ లోపల రికార్డైన ఈ క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. "మళ్లీ నిరసనల్లో కనిపిస్తే జేబుల్లో 50 గ్రాముల డ్రగ్స్ పౌడర్ పెట్టి కేసేస్తా. అసలు బెయిల్ రాకుండా జైల్లో మగ్గేలా చేస్తా" అని సదరు కానిస్టేబుల్ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడం, కాంగ్రెస్, ఆప్, కాక్రోచ్ జనతా పార్టీ వంటి విపక్షాలు నెట్టింట విరుచుకుపడడంతో ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. 

విద్యార్థులను బెదిరించిన కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుత విధులనుంచి తొలగించి, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డీసీపీ అక్బర్ పఠాన్ వెల్లడించారు. విద్యార్థులపై బెదిరింపులు ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని కాంగ్రెస్ మండిపడగా.. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆప్ హెచ్చరించింది. 

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని నకిలీ డ్రగ్స్ కేసేయడానికి వాడుతున్నారా అని సీజేపీ ప్రశ్నించింది. పేపర్ లీకేజీలపై విద్యా సంస్కరణలు రావాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నటుడు ఇమ్రాన్ ఖాన్ సహా అనేకమంది ప్రముఖులు శివాజీ పార్క్, ఆజాద్ మైదాన్ వంటి చోట్ల ఆందోళనలకు మద్దతుగా రోడ్డెక్కారు.