కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీపై ప్రభావమేమి ఉండదు: విజయశాంతి

కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీపై ప్రభావమేమి ఉండదు: విజయశాంతి
  •  ఈ అంశంపై చర్చలు పెట్టడం హాస్యాస్పదం : విజయశాంతి

హైదరాబాద్, వెలుగు : లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోతే రాష్ట్ర బీజేపీపై ప్రభావమేమి ఉండదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. కవిత అరెస్ట్ జరగకపోతే రాష్ట్ర బీజేపీ నేతలకు నిరాశే విుగులుతుందని పేర్కొంటూ  ఓ చానెల్ నిర్వహించిన డిబేట్ అర్థరహితమని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకే బీజేపీ లిక్కర్ స్కామ్ పేరిట అరెస్టులు చేస్తున్నదనడం హాస్యాస్పదమని చెప్పారు. కొందరు పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంపీ సీట్లు ఎన్నో  తెలుసుకుంటే ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు.