- రెండో ర్యాంక్‌లో స్మిత్
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
దుబాయ్: యాషెస్ సిరీస్‌లో వీరోచితంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరువగా వచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (922) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, స్మిత్ (913) రెండో స్థానానికి ఎగబాకాడు. యాషెస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించడం స్మిత్‌కు కలిసొచ్చింది. కివీస్ సారథి విలియమ్సన్ (887) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. చతేశ్వర్ పుజారా (881) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కివీస్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీతో టీమ్‌ను గెలిపించిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె నాలుగు ర్యాంక్‌లు మెరుగుపడి 8వ స్థానంలోకి దూసుకొచ్చాడు. హెన్రీ నికోలస్ (770),
మర్క్రమ్ (719), డికాక్ (718).. ఐదు, ఆరు, ఏడు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. రూట్ (710) తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. బౌలింగ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా (794) ఒక్క స్థానం మెరుగుపడి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. అశ్విన్ (763) పదో ర్యాంక్‌లో ఉండగా, బుమ్రా, షమీ, ఇషాంత్ వరుసగా 16, 21, 25వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. కమిన్స్, రబడ, అండర్సన్.. టాప్–3లో కొనసాగుతున్నారు.