హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ రేసులో నిలిచారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి వివేక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన అభ్యర్థిత్వాన్ని బి. తరుణ్ రాజ్, ఎ. నరసింహారావు ప్రపోజ్ చేశారు. కె. అనిల్ కుమార్, ప్రకాశ్‌చంద్ జైన్ కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఆర్. ఎమ్. భాస్కర్, జె. శివాజి యాదవ్ సెక్రెటరీ పోస్ట్ బరిలో నిలిచారు. పి. శ్రీధర్ ట్రెజరర్‌కు, డి. నర్సింగ్ రావు జాయింట్ సెక్రెటరీకి నామినేషన్ దాఖలు చేశారు.
గెరార్డ్ చార్లెస్ కార్ వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఆశిస్తున్నారు. సి. బాబురావు ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ రెండు పోస్ట్‌లకు నామినేషన్ వేసినట్టు ఎలక్టోరల్ ఆఫీసర్ వీఎస్ సంపత్ ప్రకటించారు. నామినేషన్లకు శుక్రవారం ఆఖరి రోజు కాగా విత్‌డ్రాకు 23 వరకు అవకాశం ఉంది. ఈ నెల 27న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.
