గుడ్డుకు గడ్డు కాలం! తమిళనాడులో గుడ్ల వ్యాపారంపై యుద్ధం ఎఫెక్ట్ 

గుడ్డుకు గడ్డు కాలం! తమిళనాడులో గుడ్ల వ్యాపారంపై యుద్ధం ఎఫెక్ట్ 
  • గల్ఫ్ దేశాలకు నిలిచిన ఎక్స్ పోర్ట్స్​ 
  • రోజుకు సుమారు రూ.5 కోట్ల నష్టం

చెన్నై: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తమిళనాడులోని గుడ్ల వ్యాపారంపై తీవ్రంగా పడింది. దేశంలోని ప్రధాన గుడ్ల ఉత్పత్తి కేంద్రంగా పేరు గాంచిన నమక్కల్ నుంచి జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతల రవాణాలో అంతరాయం ఏర్పడటంతో గల్ఫ్ దేశాలకు సరుకు పంపడం కష్టమవుతోందని ఎగుమతిదారులు తెలిపారు. దీంతో రోజుకు సుమారు రూ.5 కోట్ల నష్టం వస్తోందని అంచనా వేస్తున్నారు. 

నమక్కల్ నుంచి సాధారణంగా యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి దేశాలకు భారీగా గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. రోజూ సుమారు ఒక కోటి గుడ్లు పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి అవుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయని పేర్కొన్నారు. 

ఎగుమతులు నిలిచిపోవడంతో సమక్కల్ మార్కెట్​లో గుడ్ల ధరలు కూడా పడిపోయాయి. ఒక్క గుడ్డు ధరను నెక్ రూ.4.30 గా నిర్ణయించింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి గుడ్ల కొనుగోలు నిలిపివేయడంతో డిమాండ్ 
తగ్గిందని కమిటీ వర్గాలు తెలిపాయి.