కంటి చూపు మెరుగు పరుచుకునే మార్గాలివే..

కంటి చూపు మెరుగు పరుచుకునే మార్గాలివే..

సాంకేతిక పరిఙానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఆ సాంకేతికతే మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతోంది. ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్ చాలా అవయవాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్​లు, ల్యాప్​ట్యాప్​లు, స్మార్ట్​ టీవీలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని వాడుతున్నప్పుడు వాటి డిస్​ప్లే ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది.  తద్వారా వెంటనే కాకపోయినా దీర్ఘకాలంలో ఈ పరిణామాలు కంటిని తీవ్రంగా నష్టపరుస్తాయి. తద్వారా కంటి చూపు మందగిస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పిల్లలు సాధారణంగా నిమిషానికి18 నుంచి 22 సార్లు కను రెప్పలు వేస్తారు. అలాంటిది స్మార్ట్​ స్ర్కీన్స్​ చూస్తున్నప్పుడు 50 శాతం తక్కువ రెప్పలు వేస్తున్నారు. పెద్దల్లో సైతం ఇలాంటి సమస్య ఉందని నివేదిక వెల్లడించింది. అయితే మొబైల్స్​ నిత్యవసరమైన ఈ రోజుల్లో వాటిని మినహాయించడమనేది కష్టమే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.  మరి కంటి చూపును మెరుగు పరుచుకోవడమెలాగో చూద్దాం...

  • ఉదయం, సాయంత్రం 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి.
  • టీ స్పూన్​ మహాత్రిఫలాఘృత ని పాలతో కలిపి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు తీసుకోండి.
  • అలోవెరా, ఉసిరికాయ రసాన్ని తాగితే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
  • త్రిఫల, రోజ్​వాటర్​తో కళ్లను వాష్​ చేయాలి.

ఏం తినాలి...

  • ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు
  • నీటిలో నానబెట్టిన 8 బాదంపప్పులు
  • క్యారెట్​, పాలకూర, బ్రోకలీ, చిలగడదుంప, స్ట్రాబెర్రీ

ఇవి తింటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.