చైనా యాప్స్‌ బ్యాన్‌: స్పందంచిన టిక్‌టాక్‌

చైనా యాప్స్‌ బ్యాన్‌: స్పందంచిన టిక్‌టాక్‌
  • డేటా ఎవరితో షేర్ చేయలేదని వివరణ

న్యూఢిల్లీ: తక్కువ కాలంలోనే విపరీతంగా ఫేమస్‌ అయి.. కోట్లాది మంది యూజర్లను ఆకర్షించిన చైనా యాప్‌ టిక్‌టాక్‌ను మన దేశంలో బ్యాన్‌ చేయడంపై యాప్‌ వర్గాలు స్పందించాయి. తమ యూజర్ల ఇన్ఫర్మేషన్‌ని ఏ ఫారెన్‌ కంట్రీస్‌తో షేర్‌‌ చేసుకోలేదని, కనీసం చైనా గవర్నమెంట్‌కు కూడా అందించలేదని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు కంపెనీ ప్రభుత్వ వర్గాలను ఆహ్వానించింది అని అన్నారు. “ ఇండియన్‌ లా ప్రకారం టిక్‌టాక్‌ ఉంది. యూజర్స్‌ డేటాను ఎవరికీ షేర్‌‌ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్‌‌లో అలాంటి రిక్వెస్ట్‌లు వచ్చిన చేయదు కూడా. యూజర్స్‌ ప్రైవసీ, ఇంటిగ్రిటీకి ఇంపార్టెన్స్‌ ఇస్తాం” అని నిఖిల్‌ గాంధీ చెప్పారు. యూజర్ల డేటా చోరీకి పాల్పడుతున్నారని గుర్తించి చైనాకు చెందిన 58 యాప్‌లపై కేంద్రం కొరడా ఝులిపించింది. వాటిని బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టిక్‌టాక్‌ సహా క్లబ్‌ఫ్యాక్టరీ, షేర్‌‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌‌ తదితర యాప్‌లను ప్లే స్టోర్‌‌, యాపిల్‌ స్టోర్‌‌ నుంచి తొలగించింది.