భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తాం

భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తాం

నరసరావుపేట : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన లైంగిన దాడిపై హోంమంత్రి సుచరిత మాట్లాడారు. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశామని.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

ప్రస్తుతం బాధిత మహిళ ఆసుపత్రిలో కోలుకుంటోందన్న ఆమె.. ప్రభుత్వం తరపున బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూస్తామన్న సుచరిత.. ఈ సంఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని తెలిపారు.