V6 News

విరాట్​ చెప్తే మాకేంటి..!

విరాట్​ చెప్తే మాకేంటి..!
  • కోచ్‌ సెలెక్షన్‌లో సీఏసీ న్యూట్రల్‌గా పని చేస్తుంది: గైక్వాడ్‌
  • అభిప్రాయం చెప్పడం కోహ్లీ హక్కు: గంగూలీ

కోల్‌కతా: టీమిండియా హెచ్‌ కోచ్‌ ఎంపిక విషయంలో క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) పారదర్శకంగా పని చేస్తుందని ఆ కమిటీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ స్పష్టం చేశాడు. కోచ్‌ ఎంపిక విషయంలో  ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సహా ఎవరెవరూ ఏమన్నా అది సీఏసీకి అనవసరమన్నాడు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని సీఏసీలో శాంతా రంగస్వామితోపాటు ఒకప్పటి టీమిండియా కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా సభ్యుడు. గతంలో మహిళల జట్టు కోచ్‌ను ఎంపిక చేసినప్పుడు ఎన్నో చర్చలు జరిగాయని అన్షుమన్‌ గుర్తు చేశాడు. సీఏసీ ఎవరి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వకుండా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసిందన్నాడు. తమకు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే పని చేస్తామన్నాడు.మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌, టెక్నికల్‌ అంశాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి కోచ్‌గా అవసరమని చెప్పాడు. అయితే, కోచ్‌ సెలెక్షన్‌ విషయంలో టీమ్‌ కెప్టెన్‌గా తన అభిప్రాయం తెలిపే హక్కు విరాట్‌కు ఉందని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు.