ఇటీవల దెబ్బతిన్న నూక్లియర్ పవర్ రాకెట్‌ను తిరిగి డెవలప్ చేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో శ్వేత సముద్రం దగ్గర నావికా పరీక్ష నిర్వహిస్తుండగా రాకెట్ ఇంజన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంజనీర్లతో పాటు ఐదుగురు చనిపోయారు. మరణించిన వారి పేరుతో అవార్డులను వారి భార్యలకు అందించారు పుతిన్. ఇకపై ఎలాంటి లోపాలు లేకుండా వెపన్స్ ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
