సీబీఐ ఆఫీస్ కు మమతా.. భారీగా చేరుకున్న కార్యకర్తలు

సీబీఐ ఆఫీస్ కు మమతా.. భారీగా చేరుకున్న కార్యకర్తలు

సీబీఐతో యుద్ధానికే సిద్ధమయ్యారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్నికల్లో గెలుపు తర్వాత మరింత దూకుడు పెంచిన మమత... కేంద్రంతో ముఖాముఖి పోరుకు రెడీ అయ్యారు. నారదా స్కామ్ విషయంలో మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్ కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను విచారణకు పిలిచింది సీబీఐ. వారిని అండర్ అరెస్ట్ లో ఉంచినట్టు సీబీఐ ప్రకటించింది. వారు కోల్ కతాలోని సీబీఐ ఆఫీస్ కు చేరుకున్న కాసేపటికే మమతా బెనర్జీ కూడా సీబీఐ ఆఫీస్ కు వచ్చారు. అయితే ఆమెను విచారణకు పిలవకపోయినా... మమతా బెనర్జీ ఆఫీస్ కు వచ్చారు. మమతా బెనర్జీ రాకతో TMC కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. దీంతో కోల్ కతాలోని సీబీఐ ఆఫీస్ దగ్గర టెన్షన్ క్రియేట్ అయింది. ఈ మధ్యే మంత్రులపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.