కోల్‌కతా: కేంద్ర బడ్జెట్‌ను హంప్టీ డంప్టీ బడ్జెట్‌గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘బెంగాల్‌కు ఈ బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనది. మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఈ బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది’’ అని మమత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బడ్జెట్ పూర్తిగా నిస్సారమైనదని మండిపడింది. యువతకు ఉపాధి కల్పించడంలో, రైతులను ఆదుకోవడంలో విఫలమైందని పేర్కొంది.
