న్యూఢిల్లీ: ఈ వీకెండ్‌లో జరిగే ఐపీఎల్ 15వ సీజన్ ప్లేయర్ ఆక్షన్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడైన జేసన్ హోల్డర్ ఆక్షన్‌లో హాట్ కేక్‌గా మారనున్నాడు. తన కోసం ఆర్‌సీబీ ఫ్రాంచైజీ పెద్ద మొత్తం పక్కనబెట్టిందని తెలుస్తోంది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ ఇప్పుడు ఫారిన్ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. దీనికి పక్కాగా సరిపోయే హోల్డర్ కోసం ఆర్‌సీబీ రూ. 12 కోట్ల వరకూ బిడ్ చేయనుందని సమాచారం. అదే టైమ్‌లో తెలుగు క్రికెటర్, సీఎస్‌కే రిలీజ్ చేసిన సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు కోసం రూ. 8 కోట్లు పక్కనబెట్టిందని తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ మాజీ బ్యాటర్, యంగ్‌స్టర్ రియాన్ పరాగ్ కోసం మరో ఏడు కోట్ల దాకా ఖర్చు చేయాలని భావిస్తోందట. కాగా, ఆక్షన్‌లోకి రావాలని గతంలో పలు టీమ్స్ తనను అప్రోచ్ అయ్యాయని కోహ్లీ తెలిపాడు. వాటి గురించి ఆలోచించినా చివరకు ఆర్సీబీతోనే ఉండాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు.

