ఆస్ట్రేలియాతో.. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఓటమి దిశగా విండీస్​

ఆస్ట్రేలియాతో.. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఓటమి దిశగా విండీస్​

అడిలైడ్‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్​ ఓటమి దిశగా సాగుతోంది.  ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (119) సెంచరీతో చెలరేగడంతో.. 59/2 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 81.1 ఓవర్లలో 283 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

ఫలితంగా కంగారూలకు 95 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ లభించింది.  ఖవాజ (45), లైయన్‌‌‌‌‌‌‌‌ (24) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు 22.5 ఓవర్లలో 73/6 స్కోరు చేసింది. డి సిల్వ (17 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. విండీస్‌‌‌‌‌‌‌‌ ఇంకా 22 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది.