సరిగ్గా నిద్రపోవాలంటే.. ఈ టీ తాగేయండి

సరిగ్గా నిద్రపోవాలంటే.. ఈ టీ తాగేయండి

చామంతి టీ తాగడం మంచిది అంటున్నారు న్యూట్రిషనిస్టులు. చామంతిలోని ఫ్లేవనాయిడ్స్​లో ఔషధ గుణాలు ఉంటాయి. చలికాలంలో ఈ టీ తాగితే హెల్దీగా ఉండొచ్చు.   నిద్రలేమి(ఇన్​సోమ్నియా)తో బాధపడేవాళ్లు చామంతి టీ తాగాలి. ఈ టీలో ఉండే ఎపిజెనిన్​ అనే యాంటీ ఆక్సిడెంట్​ నిద్ర పట్టేలా చేస్తుంది. మూడ్​ స్వింగ్స్​ ఉన్నప్పుడు చామంతి టీ టేస్ట్​ చేస్తే మూడ్​ మారుతుంది. మనసు తేలికవుతుంది.   ఈ సీజన్​లో రోజూ వేడివేడి చామంతి టీ తాగితే జలుబు నుంచి రిలీఫ్​ ఉంటుంది. అంతేకాదు, చామంతి టీ ఆవిరి పట్టినా కూడా ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి తగ్గిపోతాయి.   నెలసరి నొప్పులు తగ్గడానికి కూడా చామంతి టీ యూజ్​ఫుల్. చామంతి టీలోని  యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు బ్లడ్​ షుగర్​ని తగ్గిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండే ఈ టీని డయాబెటిస్​ ఉన్నవాళ్లు కూడా తాగొచ్చు.