మనం ఎక్కువగా పెద్దల నుంచి ఈ మాట వింటూ ఉంటాం.. "పదేపదే ఎవరినీ ఉప్పు అడగొద్దు"...... "సూర్యాస్తమయం అయ్యాక ఉప్పు బయట వారికి ఇవ్వకూడదు" అని. కానీ ఈ విధంగా చెప్పడానికి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఏంటో.....
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పుకు శుక్రుడు, చంద్రుడు అనే రెండు గ్రహాలతో సంబంధం ఉంది. శుక్రుడు సంపద, సుఖసంతోషాలు, పెళ్లి జీవితానికి కారకులు. చంద్రుడు మన మనశ్శాంతి, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఉప్పు విషయంలో పొరపాట్లు చేస్తే ఈ రెండు గ్రహాల ప్రభావం మనపై పడుతుందని నమ్ముతారు.
1. పదేపదే ఉప్పు అడగడం
చాలామంది పక్కింటి వాళ్ళను ఎక్కువగా ఉప్పు అడుగుతుంటారు. శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్ర గ్రహం బలహీనపడుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు... అనవసర ఖర్చులు పెరిగి, పొదుపు తగ్గుతుంది. అందుకే పాతకాలంలో ఉప్పును ఉచితంగా తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు.
2. మనశ్శాంతిపై ప్రభావం
ఉప్పుకు చంద్రుడితో సంబంధం ఉండటం వల్ల, అనవసరంగా ఉప్పు అడిగే అలవాటు ఉన్నవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, కుటుంబంలో గొడవలు జరగడం వంటివి సంభవించవచ్చు.
3. సాయంత్రం వేళ
వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు. సాయంత్రం పూట ఉప్పు ఇస్తే ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ (మంచి శక్తి) బయటకు వెళ్లిపోతుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, తద్వారా దరిద్రం చుట్టుముడుతుందని పెద్దలు చెబుతారు.
ఉప్పుతో కలిగే కొన్ని మంచి ఫలితాలు:
జ్యోతిష్యం, వాస్తులో ఉప్పును నెగటివ్ ఎనర్జీని అంటే చెడు శక్తిని పోగొట్టడానికి ఒక ఆయుధంగా వాడతారు. ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాతి ఉప్పు (కల్లుప్పు) కలిపి ఇల్లు తుడిస్తే, ఇంట్లోని చెడు పోయి ప్రశాంతత లభిస్తుంది. మనశ్శాంతి కోసం ఒక గాజు గిన్నెలో ఉప్పు నింపి బాత్రూమ్‌లో లేదా ఇంటి మూలలో ఉంచితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఈ నమ్మకాలు పూర్తిగా సంప్రదాయాలపై ఆధారపడి ఉన్న... ఇప్పటికీ చాలామంది వీటిని పాటిస్తూనే ఉన్నారు.
