పురాణాల ప్రకారం నుదుట 'సింధూరం' అందుకే పెట్టుకుంటారట..

పురాణాల ప్రకారం నుదుట 'సింధూరం' అందుకే పెట్టుకుంటారట..

సింధూరం.. హిందూ సంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. స్ర్కీ నుదుట దిద్దే ఈ సింధూరానికి.. వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా పరిగణింపబడుతుంది. వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన ఈ సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. జుట్టుకు, నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో సింధూర్ పూసే ఈ వేడుకను సింధూర్ డాన్ అని కూడా పిలుస్తారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం.

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మేష రాశికి అధిపతి అంగారకుడు. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదమని నమ్ముతారు. ఎర్రటి సిందూర్ నుదుటిపైన ధరించడానికి మరొక కారణమేమిటంటే.. స్త్రీ సౌభాగ్యంగా, శక్తితో ఉంటుందని.. వీటికి చిహ్నంగా పెడతారని శాస్త్రం వివరిస్తోంది.

పురణాల ప్రకారం,

పురాణాల ప్రకారం, శివుని భార్య అయిన పార్వతి తన భర్త పట్ల తనకున్న భక్తి, వాత్సల్యానికి చిహ్నంగా నుదుటిపై సింధూరాన్ని ధరించేది. సింధూరం శివునికి ఇష్టమైనదని, నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు సుదీర్ఘమైన, ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారని ఆమె నమ్మేది. అంతే కాదు వధువు నుదుటిపై సింధూరం పెట్టడం కూడా పుణ్యఫలంగా పరిగణించబడుతుంది. ఇది జంటకు అదృష్టాన్ని, శ్రేయస్సును ఇస్తుందని, దుష్ట ఆత్మలను నివారించి, జంటను హాని నుండి కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు. అందువల్ల సిందూర్ ధరించడాన్ని ప్రేమ, భక్తికి చిహ్నంగా మాత్రమే కాకుండా నూతన వధూవరులకు భద్రత, ఆశీర్వాదాలను అందిస్తుందన్నమాట.

అందానికి..

చాలా మంది భారతీయ స్త్రీలు అందం కోసం సింధూరంను ధరిస్తూ ఉంటారు. వివాహితలు తమ భర్తల హృదయాలను గెలుచుకోవడానికి, అందంగా ఉండేందుకు కూడా ధరిస్తారని కొందరి అభిప్రాయం. అగ్ని, రక్తం.. లాంటివి ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి సింధూరాన్ని శక్తిగా పరిగణిస్తారు. దీని వల్ల ఆమెకు గౌరవం, శక్తి వస్తాయని పలు పురాణాలు వెల్లడిస్తున్నాయి.