లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీ కండి : డబ్ల్యూహెచ్ వో

లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీ కండి : డబ్ల్యూహెచ్ వో

న్యూయార్క్ : మూడు వారాలుగా ప్రపంచమంతా లాక్ డౌన్ లోఉంది. దీంతో కేసులు తక్కువగా నమోదైన దేశాల్లో లాక్ డౌన్ సడలించడానికి ఆలోచించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) సూచించింది. ఒకేసారి కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా లాక్ డౌన్ తొలగించాలని డబ్ల్యుహెచ్వో టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ కోరారు. ‘పరిస్థితిని అంచనా వేసుకుంటూ లాక్ డౌన్ ఆంక్షలను సడలించినట్లయితే… ప్రజలు మునుపటిలా తమ తమ పనుల్లోకి వెళ్లగలుగుతారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి తేరుకుంటుంది’ అన్నారు. లాక్ డౌన్ తొలగించినప్పటికీ జనం కొంతకాలం పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించారు.