రాబోయే రోజుల్లో కరోనా మరింత వ్యాపిస్తుంది: టెడ్రోస్ అధనామ్

రాబోయే రోజుల్లో కరోనా మరింత వ్యాపిస్తుంది: టెడ్రోస్ అధనామ్

కరోనా వైరస్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు అంటున్నాయి. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)  మాత్రం దీనికి విరుద్ధంగా  సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమేనని, ముందుముందు మహమ్మారి మరింత వ్యాప్తి చెందనుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణ చర్యల కారణంగా కొంత వరకు నిదానించిందని గుర్తు చేశారు. అయితే లాక్ డౌన్ ను శాశ్వతంగా అమలు చేసే అవకాశం లేదని కూడా చెప్పారు.

రాబోయే రోజుల్లో ఆరోగ్య విధానం తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణాల సంఖ్య మరింత పెరగనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసింది. ఇప్పటికే 25 లక్షల మందిని బాధిస్తూ, 1.66 లక్షలకు పైగా ప్రాణాలను బలితీసుకుంది కరోనా. వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయన్న టెడ్రోస్ అధనామ్.. వ్యవస్థలు స్తంభించాయన్నారు.