ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో తేలిన ఓటర్లు

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో తేలిన ఓటర్లు
  • 7 నియోజకవర్గాల్లో 16,50,175 మంది 
  • పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

ఆదిలాబాద్/ ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. సోమవారం ఓటర్ల ఫైనల్​లిస్ట్​ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా  ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,338 మంది ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే వారిదే ఆధిపత్యం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

190 మైక్రో అబ్జర్వర్ల​ కేటాయింపు

ఆదిలాబాద్​పార్లమెంట్​పరిధిలోని లోక్ సభ ఎన్నికలకు సంబంధించి  7 నియోజక వర్గాలకు 190 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎన్​ఐసీ మీటింగ్​ హాల్​లో సోమవారం మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్​పరిధిలోని ఆదిలాబాద్​కు 14, బోథ్​కు 30, ఆసిఫాబాద్ కు 24, సిర్పూర్​కు16, నిర్మల్​కు 30, ఖానాపూర్ కు 49, ముథోల్​కు 27 మొత్తం 190 మైక్రో అబ్సర్వర్స్​ను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ శ్యామలాదేవి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ ఈడీఎంలు, జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎన్నికల  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.