కెనడాలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు.. భారత్ సీరియస్

కెనడాలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు.. భారత్ సీరియస్

కెనడాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైయ్యాడు. టొరంటోలో జరిగిన ఖల్సా డే (వైశాఖి) వేడుకలో కొంతమంది ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. కెనడియన్ PM జస్టిన్ ట్రూడో హాజరైన ఈవెంట్ లో ఖలిస్తాన్ ప్రత్యేక దేశాన్ని (ఏర్పాటు వాదాన్ని) ప్రోత్సహించే స్లోగెన్స్ చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు X లో ప్రత్యేక్షమైయ్యాయి. దీనిపై భారత్ సోమవారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడా డిప్యూటీ హైకమిషనర్‌ను భారత విదేశాంగ శాఖ పిలిపించింది. ఈ విషయాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది. కెనడా డిప్యూటీ హైకమిషనర్ కు విదేశాంగ శాఖ సమాన్లు జారీ చేసింది. దీనిపై వివరాణ ఇవ్వాలని కెనడా రాయబారిన కోరింది.