అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ) టెక్నికల్ అసిస్టెంట్లు, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 04.
పోస్టుల సంఖ్య: 13.
ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ 05, టెక్నీషియన్ 08.
ఎలిజిబిలిటీ
టెక్నికల్ అసిస్టెంట్: పోస్టులను అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్/ టెక్నాలజీలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా
ఉత్తీర్ణత సాధించడంతోపాటు రెండేండ్ల అనుభవం లేదా బీఎస్సీతోపాటు ఐపీఆర్/ హెచ్ఆర్/ఫైనాన్స్/ ఐటీ మొదలైన వాటిలో ఏడాది ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
టెక్నీషియన్: సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55 శాతం మార్కులతో ఎస్ఎస్సీ/ 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా సంబంధిత విభాగంలో మూడేండ్ల అనుభవం/అప్రెంటీస్ శిక్షణ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 10.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
లాస్ట్ డేట్: 2026, జనవరి 04.
సెలెక్షన్ ప్రాసెస్: ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ampri.res.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
జీతం: 35400 నుంచి 1,12,400
