Mowgli Box Office: ‘మోగ్లీ’ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. రోషన్ కనకాల మూవీకి ఎన్ని కోట్లంటే?

Mowgli Box Office: ‘మోగ్లీ’ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. రోషన్ కనకాల మూవీకి ఎన్ని కోట్లంటే?

రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’. కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి మిక్సెడ్ టాక్ వస్తోంది. నిన్న శనివారం (డిసెంబర్ 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన డీసెంట్ ఓపెనింగ్ అందుకుంది. ఈ సందర్భంగా ఫస్ట్ డే వసూళ్లను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి రోజు + ప్రీమియర్‌లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.1.22 కోట్ల గ్రాస్ సాధించినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.

‘‘మోగ్లీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ అందుకుంది. ఫస్ట్ డే + ప్రీమియర్ కలిపి రూ.1.22 కోట్లు వసూలు చేసింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్గా మోగ్లీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి’’ అని నిర్మాతలు తెలిపారు. ఇండియాలో రూ.75 లక్షల నెట్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఈ సినిమాకు పోటీగా థియేటర్లో అఖండ 2 ఉండటం, కొన్ని వర్గాల నుంచి మిక్సెస్ టాక్ రావడం మోగ్లీకి మైనస్గా నిలిచింది. ఈ క్రమంలోనే మోగ్లీ ఫస్ట్ డే వసూళ్లలో నిరాశపరిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వీకెండ్ షోస్ నడిచికొద్దీ టాక్ పాజిటివ్గా మారితే.. కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా ‘మోగ్లీ’ తెరకెక్కింది.

కథేంటంటే:

పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతం. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాడు మోగ్లీ ఉరఫ్ మురళి (రోషన్‌ కనకాల). అతను ఒక  అనాథ. అడవినే తల్లిగా భావించే మోగ్లీ ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. అలా తన జీవనం సాగించుట కొరకు బెస్ట్ ఫ్రెండ్ అయిన బంటి (వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి వెళుతుంటాడు. అక్కడ జూనియర్‌ ఆర్టిస్టులను చేరవేయడం అతని పని. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్లో భాగంగా డూప్‌గా నటించాల్సి వస్తుంది మోగ్లీ. ఇక అదే సినిమా టీమ్‌లోని సైడ్‌ డ్యాన్సర్ జాస్మిత్‌ (సాక్షి మడోల్కర్‌)తో లవ్లో పడతాడు. అయితే, ఆమెకు చెవులు వినపడవు. మాటలు రావు. జాస్మిత్‌ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది.

అలా సీతరాముల్లాంటి ఈ జంట మధ్యలోకి రావణుడిలా ఎంట్రీ ఇస్తాడు SI క్రిప్టోఫర్‌ నోలన్‌ (బండి సరోజ్‌ కుమార్‌). నోలన్‌ రాకతో జాస్మిత్‌ లైఫ్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో నోలన్‌, హీరోయిన్ జాస్మిత్‌పై మోజు పడతాడు. ఎలాగైనా ఆమెను వాడుకోవాలని ఎన్నో పథకాలు వేస్తాడు. ఇలా జాస్మిత్‌-మోగ్లీ జంటని ఎన్నో చిత్రహింసలు పెడతాడు.

ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్‌ బారీ నుంచి.. ప్రియురాలు జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్‌ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి జాస్మిత్‌-మోగ్లీ ప్రేమ గెలిచిందా లేదా? అడవిని నమ్ముకుని బ్రతికే మోగ్లీకి.. ఆ దైవం ఎలాంటి ధైర్యం ఇచ్చింది? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే.