Akhanda 2 Box Office: అఖండ 2 బాక్సాఫీస్ ర్యాంపేజ్.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Akhanda 2 Box Office: అఖండ 2 బాక్సాఫీస్ ర్యాంపేజ్.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2: తాండవం బాక్సాఫీస్ ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. బోయపాటి శ్రీను శైలిలో దుమ్మురేపే మాస్, బాలయ్య బాబు డైలాగ్స్, తమన్ మ్యూజిక్ స్కోర్ వంటి అంశాలతో థియేటర్ల తుప్పురేగుతున్నాయి. వీకెండ్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో అఖండ 2: తాండవం వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

‘అఖండ 2: తాండవం’ కలెక్షన్లు:

వరల్డ్ వైడ్: ‘అఖండ 2: తాండవం’ ప్రీమియర్ షోలు + ఫస్ట్ డే వసూళ్లు కలుపుకుని రూ.59.5 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, రెండో రోజు గ్రాస్ ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. 

ఇండియా వైడ్: ‘అఖండ 2: తాండవం’ గురువారం పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.8 కోట్లు, ఫస్ట్ డే (శుక్రవారం) రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. అయితే, శనివారం కలెక్షన్లు రూ.15.50 కోట్లకు పడిపోయాయి. ఈ తగ్గుదలతో ఇండియాలో మొత్తం రూ.46 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ALSO READ : ‘మోగ్లీ’ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. రోషన్ కనకాల మూవీకి ఎన్ని కోట్లంటే?

అయితే, ఇవాళ ఆదివారం (డిసెంబర్ 14న) సెలవు దినం కాబట్టి, బాక్సాఫీస్ లెక్కలు పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే, అఖండ 2 చిత్రం రెండ్రోజుల్లో రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. 

అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్..

అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో అఖండ 2 బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.రూ.102 కోట్ల షేర్, సుమారు రూ.220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అయితే, ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఒక్కొక్కరు ఒక్కో వాల్యూతో అంచనా వేసి చెబుతున్నారు. అందువల్ల.. మేకర్స్ నుంచి అధికారికంగా అప్డేట్ వస్తేనే.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేసినట్లుగా టాక్.