గల్ఫ్ ఆఫ్ ఒమన్‎లో ఆయిల్ ట్యాంకర్ సీజ్.. 18 మంది అరెస్ట్

గల్ఫ్ ఆఫ్ ఒమన్‎లో ఆయిల్ ట్యాంకర్ సీజ్.. 18 మంది అరెస్ట్

టెహ్రాన్: గల్ఫ్​ఆఫ్​ఒమన్‎లో ఓ విదేశీ చమురు ట్యాంకర్‌ను ఇరాన్​అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 18 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 6 మిలియన్ లీటర్ల అక్రమ ఇంధనం ఉందని ఇరాన్ మీడియా సంస్థలు తెలిపాయి. ఇరాన్ అదుపులోకి తీసుకున్న సిబ్బందిలో ట్యాంకర్ కెప్టెన్‎తో పాటు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారని వెల్లడించాయి. 

ఇరాన్ జలాల్లోని పోర్ట్​సిటీ జాస్క్ వద్ద ట్యాంకర్‌ను అడ్డగించి తనిఖీ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఆ ట్యాంకర్..  ఇరాన్​అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, పారిపోయేందుకు ప్రయత్నం చేయడం, నావిగేషన్, కార్గో డాక్యుమెంటేషన్ లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.  


=============================================================     


=============================================================