మెస్సీతో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

మెస్సీతో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం..  సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్: ఫుట్ బాల్  లెజెండ్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ సక్సెస్కోవడం పట్ల ముఖ్యమంత్రి ట్వి ట్టర్ వేదిదికగా ఎమోషనల్అయ్యారు. 

'మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని,  ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు గోట్ లియోనెల్ మెస్సీ, ఫుట్ బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాతో చేరి శనివారం సాయంత్రాన్ని జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి మేం హృద యపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నం. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. 

నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బంది కి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్య వాదాలు' అంటూ అని సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.