కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో జాప్యం ఉద్రిక్తతకు దారి తీసింది.తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో అధికారుల జాప్యం అభ్యర్థుల మధ్య గొడవకు దారి తీసింది. ప్రత్యర్థులైన బుడిగె జ్ఞానేశ్వరి, గుంటి లావణ్య మధ్య స్వల్ప ఓట్ల తేడా రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మొదట గుంటి లావణ్య 3 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. రీకౌంటింగ్ కోరారు మరో అభ్యర్థి జ్ఞానేశ్వరి.
రీకౌంటింగ్ లో మరో రెండు ఓట్లు అదనంగా ఆధిక్యం సాధించింది లావణ్య.. అయినా తనను గెలిచినట్లు ప్రకటించకపోవడంతో లావణ్య వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు లావణ్య వర్గీయులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం లావణ్యను గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు ఆమె వర్గీయులు.
