ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం..సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై కాల్పులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం..సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై కాల్పులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం  రేపాయి. ఆదివారం (డిసెంబర్ 14) బీచ్ లో  ఉన్న టూరిస్టులపై  గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో 10మంది పర్యాటకులు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ దుస్తుల్లో షాట్ గన్స్ తో వచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అప్పటివరకు ప్రశాంతం ఉన్న  టూరిస్టులు భయంతో పరుగులు పెట్టారు. 

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. నల్లటి ముసుగులు ధరించిన  ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్ లో ప్రవేశించిన పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పారి పోయే ప్రయత్నం ఓ దుండగుడు భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ద్వారా ఆస్పత్రులకు తరలించారు.