ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని చూడకు: అభిషేక్ శర్మకు డివిలియర్స్ కీలక సూచన

ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని చూడకు: అభిషేక్ శర్మకు డివిలియర్స్ కీలక సూచన

న్యూఢిల్లీ: ఇండియా, సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా ఆదివారం (డిసెంబర్ 14) మూడో టీ20 జరగనుంది. చెరో విజయం సాధించిన ఇరు జట్లు మూడో టీ20లో గెలిచి సిరీస్‎లో ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. రెండు టీములు మూడో టీ20కి సిద్ధమవుతోన్న సమయంలో తొలి రెండు మ్యాచుల్లో  అంచనాల మేర రాణించడంలో విఫలమైన టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మకు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక సూచనలు చేశాడు. ప్రతి బంతిని సిక్స్‌ కొట్టాల్సిన అవసరం లేదని.. బాల్‎ను చూస్తూ పరిస్థితులకు తగ్గట్లుగా నెమ్మదిగా ఆడాలని అభిషేక్‎కు సలహా ఇచ్చాడు. ఐపీఎల్‎లో మాదిరిగా మీరు ప్రతి బంతిని సిక్స్‌గా కొట్టాలని ఎవరూ ఆశించరని చెప్పారు. వేగంగా ఆడే క్రమంలో బేసిక్స్ మర్చిపోయి ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 

మరోవైపు.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‎కు ఆరు వారాలే టైమ్‌‌‌‌‌‌‌‌ఉండటంతో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌గిల్‌‎పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా రెడీ అయ్యింది. దీంతో  గత రెండు మ్యాచ్‌‎‌ల్లో ఘోరంగా ఫెయిలైన గిల్‌‎కు సఫారీలతో జరిగే చివరి మూడు మ్యాచ్‌‎లు ఫైనల్‌‌‌‌‌‌‌‌అడిషన్‌‌‌‎గా మారాయి. మెగా టోర్నీలో ఆడే జట్టు ఫైనల్‌‌‌‌‌‌‌‌ఎలెవన్‌‌‌‌‌‌‌‌లో ఉండాలంటే ఇందులో గిల్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా రాణించాలి. లేదంటే ఇండియా ప్లాన్‌‌‌‌‌‌‌‌–బికి రెడీ కావాల్సిందే. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‎కు ముందు కెప్టెన్‌‌‌‌‌‌‌‌సూర్య ఫామ్‌‎లో లేకపోవడం కూడా ఇప్పుడు ఇండియాను ఆందోళనలో పడేశాయి. ఈ పరిణామాలతో ధర్మశాలలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఇండియా డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌వాతావరణం మాత్రం బాగా వేడెక్కింది.

జట్లు (అంచనా)

ఇండియా: సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, జితేష్‌‌‌‌‌‌‌‌ శర్మ, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, బుమ్రా. 

సౌతాఫ్రికా: మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), డికాక్‌‌‌‌‌‌‌‌, స్టబ్స్‌‌‌‌‌‌‌‌ / హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌, బ్రెవిస్‌‌‌‌‌‌‌‌, మిల్లర్‌‌‌‌‌‌‌‌, ఫెరీరా, యాన్సెన్‌‌‌‌‌‌‌‌, జార్జ్‌‌‌‌‌‌‌‌ లిండే / కేశవ్ మహారాజ్‌‌‌‌‌‌‌‌, ఎంగిడి / కార్బిన్‌‌‌‌‌‌‌‌ బోష్‌‌‌‌‌‌‌‌, ఒట్నిల్‌‌‌‌‌‌‌‌ బార్ట్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌, అన్రిచ్‌‌‌‌‌‌‌‌ / సిపామ్లా. 

పిచ్‌‌‌‌‌‌‌‌, వాతావరణం

ధర్మశాలలో టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవడం చాలా కష్టం. గత ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన జట్టే గెలిచింది. టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిచ్‌‌‌‌‌‌‌‌ పేసర్లకు సహకరించొచ్చు.