వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో ట్రక్కు ఢీకొన్న ఘటనలో తల్లి కొడుకు మృతి చెందారు. ఆదివారం ( డిసెంబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పెరిగి మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. చింతల్ చెరువు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారు దోమ మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన తల్లి నాజిమా, కొడుకు ఐయాన్ గా గుర్తించారు.. వీరు కొడంగల్ మండలం చిట్లపల్లి దర్గాకు వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైకిస్ట్ ఓవర్ స్పీడ్ తో బొలేరోకు అడ్డంగా వెళ్ళడంతో బైకును తప్పించ బోయిన బొలేరో కారునును ఢీకొట్టినట్టు తెలుస్తోంది.
కారులో ఎయిర్ బెలున్లు ఓపనవ్వడంతో కారు ఎడమ వైపు ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన బైకు కూడా డ్యామేజ్ అవ్వగా బైకిస్ట్ మాత్రం కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
