ఈ వీకెండ్ (2025 డిసెంబర్ 2'nd Week) ఓటీటీలోకి కొత్త సినిమాలు దర్శనం ఇచ్చాయి. అయితే, ఈసారి తమిళ, మలయాళ భాషల్లో క్రేజీ టాక్ తెచ్చుకున్న సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. లవ్ & ఫ్యామిలీ, థ్రిల్లర్ & సొసైటీ వంటి జానర్ సినిమాలు ఉండటం ఆడియన్స్కి వీకెండ్ పండుగనే చెప్పొచ్చు. మరి ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి? వాటి కథేంటి? అనేది తెలుసుకుందాం!!
"ఆరోమలే" ఓటీటీ:
ఇటీవలే ఓటీటీలో విడుదలైన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రమే "ఆరోమలే". ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్తో ఆడియన్స్కు ఫ్ర్ష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇందులో కిషెన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. హర్షత్ ఖాన్, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే:
అజిత్ (కిషన్ దాస్) సినిమాలు చూసి ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. కొన్ని అపర్థాల వల్ల బ్రేకప్ అవుతుంది. పెద్దయ్యాక కూడా ప్రేమించి పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. ఆ లక్ష్యంతోనే ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. కానీ.. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఒక మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడ అతని బాస్ అంజలి (శివాత్మిక రాజశేఖర్)తో అభిప్రాయ బేధాలు వస్తాయి. ఆమె మ్యాచ్‌మేకింగ్‌ను కేవలం బిజినెస్‌గానే చూస్తుంది. అలాంటి వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ఫెమినిచి ఫాతిమా ఓటీటీ:
ఫాసిల్ ముహమ్మద్ తెరకెక్కించిన సోషల్ బేస్ కాన్సెప్ట్ మూవీ "ఫెమినిచి ఫాతిమా". మనోరమా మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అక్టోబర్ 10, 2025న థియేటర్లలో విడుదలై, కేరళ స్టేట్ అవార్డ్స్లో దుమ్మురేపింది. శమ్లా హంజా కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. దర్శకుడు ఫాసిల్ ముహమ్మద్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు.
ఈ చిత్రంలో షమ్లా హంజా, విజి విశ్వనాథ్, అష్రఫ్ ఉస్తాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధీష్ స్కారియా, థమర్ కెవి నిర్మించారు.
ఫాతిమా అనే గృహిణి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇందులో స్త్రీల సమస్యలు, లింగ సమానత్వం, సాంప్రదాయం మరియు వ్యక్తిగత సాధికారత వంటి అంశాలను చర్చిస్తుంది. ఒక చిన్న సంఘటనతో ఆమె పరువు పోతుంది. ఆ పరిస్థితుల్లోనూ మానసిక ధైర్యంతో ఫాతిమా ముందుకు సాగుతుంది. ఆమె పోరాటం మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఆమె చేసిన పోరాటం ఎవరితో? ఎందుకు చేసింది? అనేది కథ సారాంశం.
కథేంటంటే:
ఫాతిమా (షామ్లా హంజా) కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఉండే సాధారణ గృహిణి. భర్త అష్రఫ్ (కుమార్ సునీల్) మసీదులో ఉస్తాద్. ఇద్దరు పిల్లలు, ఇల్లు, వంట, భర్తకు సేవ చేయడమే ఆమె డైలీ రొటీన్. అయితే.. ఒకరోజు ఇంట్లో ఉన్న పాత మ్యాట్రెస్ చిరిగిపోతుంది. దాన్ని కత్తితో కోసి చూస్తే లోపల కొంత డబ్బు ఉంటుంది. భర్త గల్ఫ్‌లో ఉన్నప్పుడు పంపిన డబ్బు అది. కానీ.. వాటి గురించి అష్రఫ్ ఎప్పుడో మర్చిపోతాడు. ఆ డబ్బులో నుంచి కొంత తీసుకుని ఫాతిమా కొత్త మ్యాట్రెస్ కొనాలి అనుకుంటుంది. కానీ భర్త అందుకు అడ్డు చెప్తాడు. ‘అది నా డబ్బు’ అని వాదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భర్తపై ఫాతిమా ఎందుకు తిరుగుబాటు చేసింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
