లోక్ సభలో చైనా సరిహద్దు అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదం అయిన తర్వాత ఇంకా ప్రచురించిన పుస్తకం, ఆ పుస్తకం రచయిత, పుస్తకంలో ఏముంది వంటి విషయాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాహుల్ ఆ పుస్తకం నుంచి ఏం అంశాలను కోట్ చేశారు.. పుస్తకం రాసిన రచయిత చైనా సరిహద్దు అంశంపై ఏం రాశారు అని చర్చ మొదలైంది. సోమవారం లోక్ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, సభలో గందరగోళం నెలకొన్న తర్వాత హాట్ టాపిక్ గా మారింది.
చైన సరిహద్దు అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ..ఇంకా ప్రచురించని మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసి పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. తాను తీసుకున్న మూలం ప్రామాణికమైనది కారవాన్ పత్రికలో తన వాదనలకు బలమైన సారాంశం ఉందని వాదించారు. దీనిపై అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
పుస్తకాలు, వార్తాపత్రికలు నుంచి వచ్చిన కథనాలను సభలో కోట్ చేయకూడదని స్పీకర్ తీర్పు ఇచ్చారు.. సభలో చర్చ చట్టాల ప్రకారం జరగాలి అని రిజుజు అన్నారు. లోక్ సభలో ఇంత గందరగోళానికి, చర్చకు దారి తీసిన ఆ పుస్తకం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ: యాన్ ఆటో బయోగ్రఫి కావడం గమనార్హం.
ఎవరీ మనోజ్ ముకుంద్ నరవణే ..?
మనోజ్ ముకుంద్ నరవణే.. రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ జనరల్. 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(COAS) గా, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి తాత్కాలిక చైర్మన్ గా పనిచేశారు. 2019లో దివంగత బిపిన్ రావత్ నుంచి COASగా బాధ్యతలు తీసుకున్న నరవణే.. 2021నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు బాధ్యతలు నిర్వహించారు.
నరవణే తన కేరీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కు నాయకత్వం వహించారు. పదాతిదళ బ్రీగేడ్ ను ఏర్పాటు చేశారు. అస్సాం రైఫిల్స్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేశారు. వెస్ట్రన్ థియేటర్ లో స్ట్రైక్ కార్స్ప్ కు నాయకత్వం వహించారు. సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కు , కోల్ కతాలోని తూర్పు కమాండ్ కు నాయకత్వం వహించారు. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా పనిచేసిన నరవణే శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళంలో పాల్గొన్నారు.
