'దాడికి గురైంది ప్రజలా? ఎంపీలా?' ఢిల్లీ నిరసనలపై కంగనా కామెంట్స్‌కు పార్వతి కౌంటర్!

'దాడికి గురైంది ప్రజలా? ఎంపీలా?' ఢిల్లీ నిరసనలపై కంగనా కామెంట్స్‌కు పార్వతి కౌంటర్!

బాలీవుడ్ నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నీట్- ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది.  జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది . దీంతో వారిపై లాఠీచార్జి  పోలీసులు జరిపారు. అయితే దీనిపై కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. 

పార్లమెంట్ మాన్సూన్ సమావేశాల తొలి రోజు నిరసనకారుల కారణంగా పార్లమెంట్ గేట్లను మూసివేశారని, లోపల ఉన్న ఎంపీలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని కంగనా తెలిపారు.. కొంతమంది ఎంపీలు ఈ గుంపు దాడి చేస్తుందేమోనని భయపడినట్లు కూడా ఆమె పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను ప్రశంసిస్తూ, వారు రక్షణ కవచంలా నిలిచారని వ్యాఖ్యానించారు. 

కంగనా వ్యాఖ్యలపై మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోతు  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 'దాడికి గురైంది ప్రజలా... లేక ఎంపీలా?' అంటూ ప్రశ్నించారు. పోలీసుల చర్యల వల్ల గాయపడింది సామాన్య ప్రజలు, విద్యార్థులేనని పేర్కొన్నారు. 'ఆ గుంపు ఎప్పుడు మీపై దాడి చేయడానికి ప్రయత్నించింది?' అని ప్రశ్నిస్తూ మండిపడ్డారు. కంగనా ధరించిన కళ్లద్దాలపై వ్యంగ్యంగా 'పవర్‌ఫుల్‌గా నిజాలను కనిపించనివ్వని గ్లాసెస్' అంటూ సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 

కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రైతుల ఉద్యమం, ఇతర రాజకీయ అంశాలపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు పార్వతి తిరువోతు స్పందనతో ఈ వివాదం మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి పోస్టులు వైరల్ అవుతున్నాయి.. అటు నెటిజన్లు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.