న్యూఢిల్లీ: హోల్సేల్ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గత నెల 42 నెలల గరిష్ట స్థాయి 8.3 శాతానికి చేరింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల ఇంధన ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. మార్చిలో ద్రవ్యోల్బణం 3.88 శాతంగా ఉండగా, ఏప్రిల్ నాటికి భారీగా పెరిగింది. ఇంధనం, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం 24.71 శాతానికి చేరింది.
ముడి చమురు ధరలు ఏప్రిల్ నెలలో 88.06 శాతం పెరిగాయి. 2021 అక్టోబర్ తరువాత ఇదే అత్యధిక స్థాయి. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్ వంటి ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 1.98 శాతానికి చేరింది.
తయారీ రంగంలోని వస్తువుల ధరలు 4.62 శాతం పెరిగాయి. చమురు ధరలు 50 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. అయితే మే నెలలో ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా.
