హిందూ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మలు సీతారాములు.సీతారాముల్లా అనురాగంతో వర్ధిల్లమని దీవిస్తారు. సీత సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి. రాముడు దశరథ రాజుకుమారుడు. కారణ జన్ముడుగా అవతారమెత్తిన వాడు. తెలుగు నేల మీద సీతారాముల కల్యాణం అయితే గాని తమ ఇంటిల్లి తలపెట్టరు. పెళ్లి కాగోరు వారికి రామ కళ్యాణం చూస్తే శుభప్రదం అవుతాయని నమ్ముతారు.
పూర్వకాలంలో రాజులు బహుభార్యాతత్వం సాగుతున్నరోజుల్లో ఒకే భార్యకి అంకితమైనవాడు. సీతారాముడు సీతాపతిగా జగద్విఖ్యాతి పొందాడు. సకల గుణాభిరాముడుఆదర్శమూర్తిగా ఖ్యాతి చెందాడు.
రాజుల పాలన కాలంలో తమ కుమార్తెల వివాహానిని సరియైన వాడిని నిర్ణయించేందుకు పలు పరిక్షలు పెట్టి.. ఆ పరీక్షల్లో నెగ్గిన వారికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేవారు. దీనికోసం స్వయం వరం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. అంటే ఇప్పట్లో పెళ్లి చూపుల తంతు అన్న మాట. దీంతో జనకమహారాజు సీతా స్వయం వరం కార్యక్రమంలో పెళ్లున విల్లు విరిగింది. వరమాల వేసేందుకు ఎదురు చూస్తున్న మైధిలి ఆత్రుత పడింది.
నాలుగు అడుగుల్లో తండ్రి జనకునిదగ్గర నుంచి నీలమేఘశ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, వీరుడిగా నిలిచిన రాముని వద్దకు వడివడిగా వెల్లింది. సిగ్గులో తలమునకలవుతూ వరమాలను రెండు చేతులతో పైకెత్తింది. కాని రాముని శిరసు అందితేనా? నవవధువు పారాణి పాదాలు మునివేళ్లపై నిలిచాయి..వరుడు ఆజానుబాహుడు అలవోకగా అందేనా? అప్పటిదాకా అన్నగారి పరాక్రమ క్రమంలో మైమరచిపోయిన లక్ష్మణస్వామిఒక్కసారి స్వయంవర వేడుకలోకి వచ్చాడు.
సీతమ్మ సమస్య అర్ధమైంది. అన్నగారి పాదపద్మాలకు నమస్కరించాడు. అన్న రామయ్య తటాలున ఒంగి అపేక్షగా తమ్ముణ్ణి లేపబోయాడు. అదే అదనుగా సీతాదేవి వరమాల శ్రీరాముని మెడలో అలంకరింపచేసింది. సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. సీతమ్మ లక్ష్మణస్వామిని చల్లని చూపుతో దీవించింది.
మహాసభకు అంతా సందర్భోచితంగానే అనిపించింది. ఇలాంటి కథలెన్నింటినో అల్లుకుని, ఆలకించి జానపదులు మురిసిపోతుంటారు. రాముడంటే అందరికీ ఇష్టం. తెలుగువారికి మరీ ఇష్టం. రాముడు.
దేవుడే అయినా మనవాళ్లకి ఆయనంటే చనువు, కష్టసుఖాలు తెలిసిన మనిషి అనుకుంటారు. రాముడిమీద ఈగవాలితే సహించరు. రామకథని మహాప్రసాదంగా కళ్లకద్దుకుంటారు. అందుకే సీతారామ కల్యాణాన్ని లోకకల్యాణంగా భావిస్తారు
