కోహ్లీని మించిన ఆటగాడు మరెవరూ లేరు: అక్తర్

కోహ్లీని మించిన ఆటగాడు మరెవరూ లేరు: అక్తర్

ఎప్పుడూ భారత ఆటగాళ్లనే ప్రశంసిస్తుంటాడని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పై సొంత దేశం పాక్ లో విమర్శలు వస్తుంటాయి. అయినా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని ప్రశంసల ద్వారా చాటుకున్నారు. అంతేకాదు కోహ్లీని ప్రశంసించడం తప్పేమీ కాదని అక్తర్ స్పష్టం చేశాడు. కోహ్లీని మించిన ఆటగాడు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో మరెవ్వరూ లేరని స్పష్టం చేశాడు.

ఓ అత్యుత్తమ ఆటగాడి టాలెంట్ ను మెచ్చుకోవడం  ఎలా తప్పవుతుందంటూ ప్రశ్నించాడు అక్తర్ . భారత క్రికెటర్లనే కాకుండా, అంతర్జాతీయంగా ప్రతిభ చాటిన ఏ దేశానికి చెందిన క్రికెటర్ నయినా అభినందిస్తానని తెలిపాడు. భారత్ కు చెందినవాడు అయినంత మాత్రాన కోహ్లీని మెచ్చుకోకుండా ఎలా ఉండగలమని అడిగాడు. అందుకే ఎవరేమనుకున్నా కోహ్లీని అభినందిస్తూనే ఉంటానని అక్తర్  తేల్చిచెప్పాడు.