కరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్

కరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్

జగిత్యాల, వెలుగు: కరోనా సోకిందని భార్యాభర్తలు సూసైడ్​ చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని శివ వీధికి చెందిన గంజి రాంబాబు(44), లావణ్య(37) దంపతులు ముంబయిలో యాడ్ ఏజెన్సీలో పని చేసేవారు. రాంబాబు తండ్రి రాజేశం 10 నెలల కింద అనారోగ్యంతో మృతిచెందారు. ఇక్కడికి వచ్చిన రాంబాబు దంపతులు అప్పటినుంచి జగిత్యాలలోనే ఉంటున్నారు. మూడు రోజుల క్రితం రాంబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. లావణ్య కూడా గురువారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దంపతులు గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి కిటికీ నుంచి లోపలికి చూశారు. ఇద్దరూ ఇంట్లో ఫ్యాన్స్ కు ఉరేసుకుని కనిపించారు. వీరికి పెండ్లయి 14 సంవత్సరాలవుతున్నా పిల్లలు లేరు.

For More News..

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీస్

కరోనాకు 4 కోట్ల డోసులు రెడీ

ఇంజనీరింగ్​లో 28% సీట్లు ఖాళీ